Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Poet Yogi Vemana
యోగి వేమన
యోగి వేమన,Yogi Vemana|Poet Yogi Vemana|Yogi Vemana photos,images|Yogi Vemana poems | Yogi Vemana poems in telugu |Yogi Vemana history in telugu | telugu poet Yogi Vemana
  

   తన సూటైన పద్యాలతో ప్రజాహృదయాలలోకి వెళ్ళిన జనుల కవి వేమన.పండిత,పామరులనే భేదం లేకుండా వేమన పద్యాలు సులువుగా అర్ధమవుతాయి.వేమన పద్యాలన్నీ ఇంచుమించు ఆటవెలదిలో ఉండి నాలుగు పాదాలలో చివరిపాదం 'విశ్వదాభిరామ వినురవేమా'అనే మకుటంతో ముగుస్తుంది.వేమన పద్యాలు వినని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి లేదేమో అంతగా జనంలోకి చొచ్చుకుపోయాయి.ప్రతీ పద్యం ఒక ఆణీముత్యమే.తెలుగు భాషకై ఎంతో కృషి సల్పిన బ్రౌన్ అక్కడక్కడా చల్లాచదురై ఉన్న పద్యాలన్నీ సేకరించి తెలుగు వారికి అందించాడు.వేమన పద్యాలు యునెస్కోవారు గుర్తించి అనేక భాషల్లోకి అనువదించారు.
    వేమన యొక్క జీవితానికి సంభందించి స్పష్టమైన ఆధారాలు లభ్యంకావడంలేదు.దీనిపై అనేక రకాలైన కధనాలు ప్రచారంలో ఉన్నాయి.అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం వేమన కడప జిల్లాలోని మూగచింతపల్లె అనే గ్రామంలో జన్మించాడు.ఇతడు 1650 - 1750 మద్యకాలంలోని వాడని తెలుస్తుంది.వేమన యవ్వనంలో వేశ్యాలోలుడై తనదగ్గరి ఆస్తినంతా వారికే దారపోసాడు.ఒక సంధర్బంలో తన వదినగారి వల్ల జ్ఞానోదయమై తన తప్పును తను ఎరిగి ఇహపర సుఖాలుపై వ్యామొహం వదిలి ఊరూర తిరిగి నీతిని,ఆత్మ,కుల,ఆర్ధిక సంస్కారాలను భోదించాడు.వేమనకు స్వర్ణం ఎలా తయారుచేసే విద్య కూడా తెలుసు.చివరకు అందరి ఎదుటా సమాది అయ్యాడు.
వేమన పద్యాల్లో ఉండే విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంపై కూడా సందిగ్దం ఉంది,ఒక వాదన ప్రకారం విశ్వద అంటే తనకు జ్ఞానోదయం ప్రసాదించిన వదిన గారు అని అభిరాముడంటే తన స్నేహితుడైన స్వర్ణకారుడు.వేరోక వాదన ప్రకారం విశ్వద అంటే విశ్వకారుడని అభిరామ అంటే ప్రియమైనవాడని అర్ధం.వినురవేమ అంటే వేమన చెప్పినది వినుమ అని.
తెలుగు వారికి వేమన అనగానే గుర్తొచ్చే పద్యం


ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడవేరయా
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ


భావం - చూడడానికి ఉప్పు,కర్పూరం ఒకేలా ఉంటాయి.కానీ వాటివాటి ధర్మాలు వేరు.అలాగే మనుషులంతా ఒకేలా ఉంటారు వారిలో పుణ్యపురుషులు వేరని అర్ధం.

Page 1
మన కవులు
   నన్నయ తిక్కన
   ఎఱ్ఱన శ్రీనాధుడు
   బమ్మెర పోతన
అల్లసాని పెద్దన
   తెనాలి రామకృష్ణుడు పింగళి సూరన
   మాదయ్యగారి మల్లన రామరాజ భూషణుడు
   యోగి వేమన అయ్యలరాజు రామభద్రుడు
   పాల్కురికి సోమనాథుడు   
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]