|
Andhra pradesh History
|
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
|
|
మన చరిత్ర
పాడిపంటలతో, ధన దాన్యాలతో ఎల్లప్పుడూ సశ్యశామలంగా విరసిల్లే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి తట్టి చూస్తే ఎంత ఘనమైనదో అర్ధం అవుతుంది. ఈ ప్రాంతాన్ని ఎంతో మంది ఉద్దండులు పరిపాలించి తమ ప్రాబవాన్ని చాటుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష తెలుగు. తెలుగు గడ్డ పౌరుషానికి,దర్పానికి నిలువెత్తు చిహ్నం. పులిబిడ్డ విరనారి రాణి రుద్రమ యిద్దభూమిలో పోరాలపటిమ పల్నాటి పౌరుషం ఇలా చెపుతూ పోతే ఎన్నో మరెన్నో...
క్రీస్తు పూర్వం నుండే ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు విరసిల్లాయని చరిత్ర చెబుతుంది. పూర్వ ఆధారాలు ప్రకారం ఆంధ్రులు క్రీస్తు పూర్వం 7వ శతాబ్ది కాలంలో వింధ్య పర్వత దక్షిణ భాగానికి వెళ్లి ద్రవిడులతో కలసిన ఆర్యలు అని చెబుతున్నాయి. క్రీపు 5వ శతాబ్దంలో భట్టిప్రోలు(అప్పటి ప్రతిపాలపురం)ను రాజధానిగా చేసుకుని కుబేరక రాజు పాలించాడని ఆధారాలు లభ్యమయ్యాయి.క్రీస్తు పూర్వం 232 లో అశోకుడు మరణాంతరం ఆంధ్రులు ప్రభావం మొదలైంది. అప్పటి నుంచే మన చరిత్ర మొదలైందని చరిత్ర కారుల అభిప్రాయం.
వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆంధ్ర శబ్దం మనకు కనిపిస్తుంది. ఆంధ్ర అనే పదం క్రీస్తు పూర్వం 600లలో మొదటి సారిగా జతి పరంగా ఐతరేయబ్రాహ్మణంలో ఉపయోగించారు.
ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, సంస్ధానాలు వారు పరిపాలించారు. ఆంధ్ర దేశ చరిత్రను ముఖ్యంగా 2గా విభజించారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దకాలంకు ముందు ఉన్న కాలాన్ని చరిత్ర పూర్వ యుగము అని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం తర్వాత వచ్చే కాలాన్ని చారిత్రక యుగమని పిలుస్తారు. చరిత్ర పూర్వ యుగానికి సంభందించిన స్పష్టమైన ఆధారాలు మనకు లభించడంలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం దగ్గరనుండి ఉన్న కాలమైన చారిత్రక యుగాన్ని మరలా మూడుగా విభజించారు మన చరిత్రకాలరులు. అవి
1.పూర్వ యుగము
2.మధ్య యుగము
3.ఆధునిక యుగము
ఇలా విభజించిన ప్రకారం ఇప్పటి వరకూ పరిపాలించిన రాజవంశాలను పరిశిలిస్తే.
చారిత్రక పూర్వయుగము - క్రీ"ఫూ 1500 ముందు
చారిత్రక యుగము
1.పూర్వ యుగము
మౌర్యులు - క్రీపూ 322 నుండి క్రీపూ 184 వరకు
శాతవాహనులు - క్రీపూ 200 నుండి క్రీత 200 వరకు
కళింగులు - క్రీపూ 180 నుండి క్రీత 400 వరకు
ఇక్ష్వాకులు - క్రీపూ 210 నుండి 300 వరకూ
బృహత్ పాలాయనులు - 300 నుండి 350
ఆనంద గోత్రులు - 295 నుండి 320
శాలంకాయనులు - 320 నుండి 420
విష్ణుకుండినులు - 375 నుండి 555
పల్లవులు
2.మధ్య యుగము
మహాపల్లవులు.
రేనాటి చోడులు, చాళుక్యులు,
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు
పూర్వాంగాంగులు - 498 నుండి 894
చాళుక్య చోళులు - 950 నుండి 1076
కాకతీయులు - 1083 నుండి 1323
ఆర్వాచీన గాంగులు
ముసునూరి నాయకులు - 1320 నుండి 1368
ఓడ్ర గజపతులు
రేచర్ల పద్మనాయకులు - 1368 నుండి 1461
కొండవీటి రెడ్డి రాజులు
రాజబహేంద్రవరం రెడ్డి రాజులు
బహమని రాజ్యము
విజయనగర సామ్రాజ్యము - 1336 నుండి 1565
3.ఆధునిక యుగము -
ఆరవీటి వంశము - 1572 నుండి 1680
కుతుబ్షాహీ యుగము - 1518 నుండి 1687
నిజాం రాజ్యము
బ్రీటీష్ వారి కాలము
స్వతంత్ర్య సంగ్రామ కాలము - 1800 నుండి 1947
ఆంధ్రప్రదేశ్ ఆవతరణ - 1954 నుండి..... |
Page 1
|
|
|
|
 |