Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
About Andhrapradesh
ఆంధ్రప్రదేశ్ గురించి
      

ఆంధ్రప్రదేశ్ గురించి -
    దక్షిణ భారతదేశంలో పాడిపంటలతో ఎప్పుడూ సశ్యశామలంగా ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్.దీనికి సరిహద్దులుగా తూర్పున బంగాళఖాతం,ఉత్తరాన చత్తిస్ ఘడ్,మహరాష్ట్ర,పశ్చిమాన కర్ణాటక,దక్షిణాన తమిళనాడు రాష్ట్రాలు కలవు.ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా దేశంలో 4వ స్ధానంలోనూ,జనాభా పరంగా 5వ స్ధానంలోనూ ఉంది.మొత్తం 23 జిల్లాలు కలవు.ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష తెలుగు.భాషా ప్రాతిపదికన దేశంలో మొట్టమొదిటి సారిగా ఎర్పడినది కూడా మన రాష్ట్రమే.తెలుగు మాట్లాడే వారందరికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ పలితంగా 1956 నవంబరు 1వ తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయపరంగానే కాకుండా పారిశ్రామిక,సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధిపధంలొ ఉంది.ప్రపంచంలోని సుప్రసిద్ద కంపెనిలన్నీ ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.ఆంధ్రులచే స్ధాపించబడిన ప్రముఖ సంస్ధలైన సత్యం,రెడ్డిస్ ల్యాబ్స్,శాంతా బయొటిక్ మొదలైనవి ప్రపంచప్రఖ్యాతి గాంచాయి.ఐ.టిలో బెంగుళూరుకు ధీటుగా మన హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది.
    విద్యారంగం విషయానికి వస్తే మన రాష్ట్రంలో 61.11% అక్షరాశ్యతా శాతం నమోదు అయ్యింది. ఇక్కడి విద్యాసంస్ధలు ఎంతో ప్రమాణిక విద్యను విద్యార్దులకు అందిస్తున్నాయి.ఉస్మానియా,ఆంధ్రా యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.ఇక్కడ చదువుకున్న విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా తమ విధులను నిర్వహిస్తున్నారు.పరిపాలన రంగానికి వస్తే ఇక్కడ మొత్తం 294 శాశనసభ స్ధానాలు,42 లోక్ సభ స్ధానాలు,18 రాజ్యసభ స్థానాలు, 10 రాజకీయ పార్టీలున్నాయి.కేంధ్రప్రభుత్వంలో అధికారాన్ని సాగిస్తున్న కాంగ్రెస్ పార్టికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువమంది ఎంపిలున్నారు.
    సంస్కృతి సాంప్రదాయాలు విషయంలో కూడా మన రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ హిందువులు 89 శాతం,ముస్లింలు9.16 శాతం,క్రిస్టియన్స్4 శాతం,మిగతా మతాలవారు 0.04 శాతం మంది ఉన్నారు.ఆంధ్రులకు ముఖ్యమయిన పండుగలు ఉగాది,సంక్రాంతి,దసరా,వినాయక చవితి,దీపావళి,రంజాన్,క్రిస్మస్ మొదలయినవి.
ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అతి పవిత్రమయిన దేవాలయం తిరుపతి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కలదు.ప్రపంచంలో వాటికన్ సిటీ తరువాత మన వేంకటేశునికే ఎక్కువ ఆదాయం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రనికి రాజధానిగా కర్నూలు ఉండేది.అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాజధానిని హైదరాబాద్ కు తరలించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రేస్ నేతృత్వంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్నీ అదిష్టించాడు.గవర్నర్ గా చందులాల్ మాధవన్ త్రివేది నియమించ బడ్డారు.
    ఆంధ్రప్రదేశ్ ను కోస్తాఅంధ్రా,తెలంగాణ,రాయలసీమ అను మూడు ప్రాంతాలుగా విభజించారు.
ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం.వరిని ప్రధాన పంటగా సాగు చేస్తారు.అందుకే మన రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశ ధాన్యగారం అని పిలుస్తారు.ఇంకా వరినే కాక మిగతా పంటలైన చెరకు,పొగాకు,ప్రత్తి,మిరప వంటి వాణిజ్యపంటలు కూడా పండిస్తారు.ప్రధాన నదులు గోదావరి,కృష్ణ,పెన్నా,తుంగభద్ర,స్వర్ణముఖి,మంజీర,ప్రాణహిత,నాగావళి,మూసీ,పాలేరు,మునేరు,గుండ్లకమ్మ.
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకతలు

*.దేశంలోనే తొలిగా ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌
* 18 సంవత్సరాలు నిండిన వారికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించినది ఆంధ్రప్రదేశ్‌లోనే
* మన దేశంలో తొలి ఓపెన్ యూనివర్సిటీ (అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ)ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెల కొల్పారు.
* దేశంలోనే తొలి హరిజన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మన రాష్ట్రం నుండే ఎన్నికయ్యారు.
* రొదసిలోకి పలు సార్లు విజయవంతంగా వ్యామ నౌకలను ప్రయోగించిన సతీష్ దావన్ అంతరిక్ష ప్రయోగ కేద్రం మన రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలొ కలదు.
* సినిమాలు నిర్మాణంలోనూ,ధియేటర్స్ సంఖ్యలోనూ మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
* భారీ నౌకలను నిర్మించే హిందుస్థాన్ షిప్ యార్డ్ మన రాష్ట్రం లొనే కలదు.
* వర్జీనియా పొగాకు పండించడంలో మనదే అగ్ర స్థానం

Page 1
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]