ఈ కలియుగంలో భక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి.ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి.స్వామి నామం ఒక్కసారి పఠిస్తెచాలు సర్వశూభాలు సిద్దిస్తాయి.శ్రీనివాసుని మహిమలకు అన్నమయ్య,త్యాగయ్య,వేంగమాంబ వంటి వారు తమ కిర్తనలతో లోకానికి చాటి చెప్పారు.అంతటి పరమపావనమైన స్వామి వారి గురించి ఒకసారి తెలుసుకుందాం.శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది.స్వామి వారిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటున్నారు.ప్రపంచంలోనే అటు ఆదాయంలోనూ ఇటు భక్తులు సందర్శించడంలోనూ రెండవ స్థానంలో ఉంది.
స్ధల పురాణం -
కలియుగంలో ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి గోవిందుడు స్వయంభూవుగా వెలిసాడు.స్వామివారిసేవలో తరించడానికి దేవతలు ఏడుకొండలుగా మారారు.అవే శేషాద్రి,నిలాద్రి,గరుడాద్రి,అంజనాద్రి,నారాయణాద్రి,వృషభాద్రి,వెంకటాద్రి. ఆదిశేశుడిగా వరం ఇచ్చిన కారణంచే శ్రీనివాసుడు శేశున్ని కొండగా మార్చి ఆ కొండమిదే కొలువై ఉండి భక్తులను కాపాడుతున్నాడు అదే శేషాద్రి.
శాశానాల ప్రకారం స్వామి వారి ఆలయాన్ని క్రీశ.300లో నిర్మించారని తెలుస్తుంది.ఆ తరువాత పల్లవులు,చోళులు,విజయనగర రాజులు ఇలా ఎంతో మంది రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ది చేస్తూ వచ్చారు.1517లో శ్రీ కృష్ణదేవరాయిలు స్వామి వారిని దర్శించి ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు.
ఆ తరువాత ఆలయాన్ని అభివృద్ది పరచడానికి ప్రభుత్వం 1932లో తిరుమల తిరుపతి దేవస్ధానం(టి.టి.డి)ని ఏర్పాటు చేసింది.అప్పటినుండి స్వామివారి నిత్యపూజలు దగ్గరనుండి అన్ని కార్యక్రమాలను టీ.టి.డి నే చూస్తుంది. కేవలం తిరుపతి పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందింది.తిరుమల చుట్టూ దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉంది.ఇక్కడి కొండలు,లోయలు,సెలయెరులు మనసుకు ఎంతో అహ్లదాన్ని కలిగిస్తాయి.తిరుమల తిరుపతిలో బాలాజీ ఆలయమే కాక గోవిందరాజస్వామి ఆలయం,వరహస్వామి ఆలయం,కోదండ రామాలయం,పాపవినాశనం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీనివాసునికి వచ్చిన ఆదాయంలో ఆలయ అభివృద్దితోపాటు టీ.టి.డి అనేక మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.దేవాలయాలను అభివృద్ది చేయడానికి నిధులు సమకూర్చడం,హిందూ మత వ్యాప్తికి కృషి చేయడం,పేద విధ్యార్ధులకు చదువు చెప్పించడం,పేదలకు వివాహాలు జరిపించడం వంటి ఎన్నో చేపడుతుంది.
|