Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Congress party history in telugu
కాంగ్రేస్ పార్టీ
     భారత రాజకీయ చరిత్రలో ప్రముఖపార్టీ కాంగ్రేస్. దీని అసలు పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రేస్. ఈ పార్టీని 1885వ సంవత్సరంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం కలిసికట్టుగా నడిపించడానికి ఉమేష్ చంద్ర బెనర్జీ, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాధ్ బెనర్జీ మొదలైనవారు కలిసి స్ధాపించారు.స్వతంత్ర్యం వచ్చిన తర్వాత అప్రతిహసంగా 1989 వరకూ పరిపాలన సాగించింది.దీనిని నెహ్రూ కుటుంబం ప్రధానంగా దగ్గరుండి నడిపిస్తుంది.ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ. 1989-2004 మధ్యలో ఒకసారి అధికారం కోల్పోయినా 2004,2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రేస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు.
రాష్ట్ర కాంగ్రేస్ విషయానికి వస్తే 1982 వరకూ ఏకచత్రాదిపత్యంగా ఉన్న కాంగ్రేస్ కు యన్.టి.రామారావు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.ఏక పక్షపాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పుకోరుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు.దీనితో ఆత్మరక్షణలో పడిన రాష్ట్ర కాంగ్రేస్ మళ్లీ 1988లో జరిగిన ఎన్నికల్లో తిరిగి తన అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ ఆనందం 1995లో జరిగిన ఎన్నికల్లో ఆవిరై తిరిగి తెలుగుదేశానికి అధికారం అప్పజెప్పింది.దీనితో చంద్రబాబు నేత్రుత్వంలోని టీ.డీ.పి గవర్నమేంట్ 9సంవత్సరాలు పరిపాలన సాగించింది.రాష్ట్రంలో కాంగ్రేస్ పరిస్ధితి దయనీయంగా ఉన్న తరుణంలో డా.వైయస్ రాజశేఖరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి నాయకత్వ లోపంతో భాధపడుతున్న కాంగ్రేస్ కు తిరుగులేని నాయకుడిగా ఎదిగి 2004,2009 ఎన్నికల్లో పార్టీ భాద్యతను తన ఒంటిచేతిపై వేసుకుని విజయపదంలో నిలిపాడు.అయితే దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2వ తేదిన నల్లమలలో జరిగిన హెలీకాఫ్టర్ క్రాష్ లొ మృతిచెందాడు. దీనితో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆర్ధికమంత్రిగా ఉన్న సీనియర్ శాసన సభ్యుడైన రోశయ్యకు అప్పగించింది.ఆతువాత కొన్ని పరిణామాల కారణంగా అప్పటి వరకూ స్పీకర్ గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రేస్ పెద్దలు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.
Page 1
మన పార్టీలు
   కాంగ్రేస్ పార్టీ తెలుగుదేశం పార్టీ
   వై.యస్సార్.కాంగ్రేస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ
   తెలంగాణా రాష్ట్ర సమితి లోక్ సత్తా పార్టీ
   మజ్లీస్ పార్టీ
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]