Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Ashtadiggajas

అష్టదిగ్గజాలు

అష్టదిగ్గజములు(కవులు) -
    విజయనగరాదీసుడైన శ్రీకృష్ణదేవరాయిలవారి ఆస్ధానంలో వున్న 8 మంది కవులను అష్టదిగ్గజములు అని పిలిచేవారు.స్వతహగా సాహితీప్రయుడైన రాయుల ఆస్ధాన సభకు భువనవిజయం అని పేరు.ఈ కవులు రచించిన అనేక రచనలు చాలా ప్రసిద్ది చెందినవి.వీరికాలం ను ప్రభందయుగంగా పిలుస్తారు.వారు
1.అల్లసాని పెద్దన -
అష్టదిగ్గజములలో ఒకడైన అల్లసాని పెద్దన తెలుగులో ప్రబంద రచనలకు ఆధ్యుడు.పెద్దన రచించిన మనుచరిత్ర తోలి తెలుగు ప్రబంధంగా గుర్తింపు పొందింది.ఇతడు మంచి కవియేగాక రాజ్యవ్యవహరములు నిర్వహించుటలో దిట్ట అందుకే రాయుల కాలంలో పెద్దనామాత్యుడు అని పిలిచేవారు.పెద్దనకు ఆంధ్రకవితా పితామహుడనే బిరుదు కలదు.
రచనలు - మనుచరిత్ర,హరికధాసారము,రామస్తవరాజము,అద్వైతసిద్దాంతము.

2.నంది తిమ్మన -
నంది తిమ్మన తన రచనలను కేవలం పండితభాషలోనే కాక సాధారణ ప్రజలకు అర్ధమయ్యే భాషలో తన రచనలు చేసాడు.అందుకే ముక్కుతిమ్మన ముద్దు పలుకులు అంటారు.నంది తమ్మన యొక్క ముక్కు పేద్దదిగా ఉండటం వల్ల మరియు ఇతడి రచనలలో ముక్కుపై ఎక్కువగా వర్ణనలు ఉండటం వల్ల ముక్కుతిమ్మన అని పిలిచేవారు.తిమ్మన రచించిన శృంగారకావ్యం పారిజాతాపహరణం ప్రసిద్ది పొందింది.ఇతడు రాయల వివాహ సమయంలో రాయుల భార్య తిరుమలదేవికి అరణంగా ఇచ్చాడు.
రచనలు - పారిజాతాపహరణం,వాణీవిలాసం

3.దూర్జటి -
శ్రీకృష్ణదేవరాయుల ఆస్ధానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడైన దూర్జటి కవి కాళహస్తిశ్వర స్వామి యెక్క భక్తుడు.కాళహస్తిశ్వరునిపై కావ్యాలు రచించాడు.
రచనలు - కాళహస్తిశ్వర శతకం,కాళహస్తిశ్వర మహత్యం

4.తెనాలి రామకృష్ణుడు -
అష్టదిగ్గజాల్లో వికటకవిగా పేరొందిన వాడు తెనాలి రామకృష్ణకవి.మొదట పామరుడైన కాళిమాత వరప్రభావంతో హస్యకవిగా మంచి పేరు సంపాదించాడు.రామకృష్ణుడి కధలుగా పిలువబడే యుక్తి కధలు తెలుగుజాతిన ప్రతీ ఇంటిలోను ఇప్పటికి వినిపిస్తాయి.ఇతడి హస్యచతురత అమోగం.రామకృష్ణుడిచే రచింపబడిన పాండురంగ మహత్స్యం ప్రముఖమైనది.
రచనలు - పాండురంగ మహత్స్యం,ఉధ్బుటా రాజ్య చరిత్ర,ఘటికాచల మహత్స్యం

5.పింగళి సూరన -
తోలి స్వతంత్ర్య తెలుగు కావ్యానికి ఆజ్యుడు పిగళి సూరన.ఇతడిచే రచించబడిన కళాపూర్ణోదయం అనే నవల ఆసీయా ఖండంలోని మొదటిది.ఇంకా గరుడ పురాణాన్ని తెలుగులోనికి అనువదించాడు.
రచనలు - కళాపూర్ణోదయం,గిరిజాకళ్యాణం,రాఘవపాండవీయం,ప్రభావతి ప్రద్యుమ్నం.

6.రామరాజ భూషణుడు -
రామరాజభూషణుడు అష్టదిగ్గజాల్లో ఒకడు.ఇతడి అసలు పేరు భట్టుమూర్తి రాయుల అల్లుడి ఆస్ధానంలో భూషణంగా ఉండటం వల్ల రామరాజభూషణుడు అనే పేరు వచ్చింది.ఇతడి రచనల్లో వసుచరిత్ర ప్రముఖమైనది.
రచనలు - వసుచరిత్ర,హరిచంద్ర,సరసభూపాలీయము,నలోపాఖ్యానము

7.మాదయ్యగారి మల్లన -
అష్టదిగ్గజాల్లో ఇకడైన మల్లన శ్రీకృష్ణదేవరాయల మంత్రి తిమ్మరుసు మేనల్లుడు.ఇతడు రచించిన రాజశేఖర చరిత్ర నాదేండ్ల అప్పనమంత్రికి అంకితమిచ్చాడు.
రచనలు - రాజశేఖర చరిత్ర

8.అయ్యలరాజు రామభద్రుడు -
రామభద్రుడు రాయల ఆస్ధానంలో అష్టదిగ్గజాల్లో ఒకడు.ఇతడు రామాభ్యుదయం అనే కావ్యం రచించి గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు.
రచనలు - రామాభ్యుదయం,సకలకధానుసారము.



Page 1

సంఖ్యా సంభందిత విషయ పరిజ్ఞానం

ఏక

చతుర

షష్ఠి

ద్వి

సప్త

త్రి

పంచ

అష్ట

నవ

దశ

   
Feedback - [email protected]