Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Mulakada perugu curry

పెరుగు ములక్కాయ కూర

కావలసిన పదార్ధాలు -
ములక్కాడలు - 4
పెరుగు - 2 కప్పులు
బూడిద గుమ్మడికాయ ముక్కలు - 200 గ్రాములు
నూనె,ఉప్పు - తగినంత
మెంతులు,జీలకర్ర,ఆవాలు - అరటీస్పూన్
కరివేపాకు - రెండురెమ్మలు
ఆవాలు -అరస్పూన్
శెనగ పప్పు - అరకప్పు
జీలకర్ర - ఒకటీస్పూన్
ఇంగువ - 1చక్క
పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
అల్లం ముక్కలు - చిన్నవి 2
పచ్చిమిరపకాయలు -5
కొత్తిమిర - 4 రెమ్మలు
తయారుచేయు విధానం - ముందుగా ఆవాలు.సెనగపప్పు 20నిమిషాలు నానబెట్టి గ్రేవి కోసం ఉంచుకున్న దినుసులతో కలిపి మెత్తగా గ్రైండ్ చేసి దానిలో పెరుగు రెండు కప్పుల నీళ్ళు పోసి పక్కన ఉంచుకోవాలి.తరువాత ములక్కాయ ముక్కలను ఉడికించాలి.మూకెడలో నూనె పోసి తాలింపు వేగాక ములక్కాయ ముక్కలను,పెరుగు మిశ్రమాన్ని కలిపి 10 నిమిషాలపాటు ఉడికించాలి.ఉడికేటపుడు తగినంత ఉప్పు వేయ్యాలి.దింపేసిన తర్వాత పైపైన కోత్తిమీర జల్లితే సువాసన వస్తుంది.
Page 1