Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Palakura Batani

పాలక్ బఠాణీ

కావలసిన పదార్ధాలు -
పాలకూర ఆకులు - 10
బంగాళదుంపలు - మూడు
క్యారెట్ - రెండు
బిట్రూట్ - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
పచ్చి బఠాణి - ఒక టేబుల్ స్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
తరిగిన అల్లం - అర చెంచా
గరం మాసాలా పొడి - అరచెంచా
ఉప్పు,నూనె - తగినంత
శనగపిండి - రెండు కప్పులు
మొక్కజొన్న పిండి - రెండు టేబుల్ స్పూన్లు
వంట సోడా - అరచెంచా
తయారుచేయు విధానం -ముందుగా పాలకూర ఆకుల్ని ఉప్పు కలిపిన వేడి నీటిలో ముంచి పక్కన పెట్టాలి.ఆ తరువాత బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేయించాలి.బంగాళదుంపలు,క్యారెట్ ,బిట్రూట్ లను సన్నగా తరిగి వేయాలి.ముక్కలు బాగా మగ్గాక ఉప్పు,కారం,గరం మసాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి.ఐదు నిమిషాలయ్యాక కొత్తిమిర,పచ్చిబఠాణి,నిమ్మరసం చేర్చాలి.ఈ మిశ్రమాన్ని పది ఉండలుగా తయారు చేసి పాలకూర ఆకుల మధ్యలొ పెట్టి చుట్టూ కఫ్ఫెయాలి.ఆకు విడిపొకుండా ఉండటానికి టూత్ పిక్ ను గుచ్చాలి.శనగపిండిలో మొక్కజొన్న పిండి,వంటసోడా తగినంత ఉప్పు వేసి బజ్జిల పిండిలా కలుపుకోవాలి.ముందుగా తయారుచేసిన పాలకూరబుట్టల్ని ఇందులో ముంచి నూనెలో దొరగా వేయించాలి.అంతే గుమగుమలాడే పాలకూర బుట్టలు రడీ.తినేముందు టూత్ పిన్ ను తిసెయాలి.
Page 1