తయారుచేయు విధానం -ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి.నానిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి.పిండిని జల్లించి పెట్టుకొవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం కొద్దిగా నీళ్ళు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి.అందులో ఈ పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.తరువాత స్టౌ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దానిని అరిటాకుపై ఒత్తుకుని కాగిన నూనెలో వేయాలి.రెండుపైపులా వేగేలా తిప్పుతూ వేయించాలి.ఎరుపు రంగు వచ్చాక ఒక ప్లేటులో నువ్వులు వేసి దానిలో ఈ అరిసెలు ఒత్తాలి. అంతే అరిసెలు రడీ.
|