తయారుచేయు విధానం - వెడల్పాటి పాత్ర తిసుకుని దానిలో నూనెపోసి కాగిన తర్వాత కరివేపాకు,పచ్చిమిర్చి,లవంగాలు,దాల్చిన చెక్క,అల్లం,వెల్లుల్లి ముద్ద పాత్రలో వేసి వేయించాలి.ఈ మిశ్రమం కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమోటో ముక్కలను కూడా కలిపి వేయించాలి.ఇవి బాగా వేగిన తర్వాత కడిగి అరబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కలపాలి.కలిపేటపుడు తగినంత ఉప్పు వేయ్యాలి.ఇలా ఒక 5 నిమిషాలు పాటు ఏగనిచ్చి బియ్యం ఎన్నయితే వేసామో దానికి రెండింతలు నీరు పోసి మూత పెట్టాలి.రైస్ ఉడకగానే దించేముందు కోత్తిమిర తురుము పైపైన జల్లితే సువాసన వస్తుంది.ఇంకేముంది టమోటో రైస్ రడీ.
|