తయారుచేయు విధానం - ముందుగా పోయ్యి మీద పాత్రను పెట్టి పప్పు పోసి దానిలో తగినన్ని నిళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి.ఈలోపులో గోంగూరను శుభ్రంగా కడిగి చిన్నగా తరుగుకుని పక్కన ఉంచుకోవాలి.ఇపుడు వేరే పొయ్యి మీద మూకెడ ఉంచి నూనె పోసి కాగనిచ్చిన తర్వాత జీలకర్ర,ఆవాలు,వెల్లుల్లి రేకలు,ఉల్లిపాయ ముక్కలు,పసుపు,పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి వేయించుకోవాలి.బాగా వేగిన తర్వాత ఇపుడు కట్ చేసి ఉంచుకున్న గోంగూరను మూకెడలో వేసి వేయించి కొంచెం చిన్న మంట మీద మగ్గనివ్వాలి.గోంగూర మగ్గిన తర్వాత ఉడకబెట్టిన పప్పును గోంగూర మిశ్రమంలో తిరగబోసి కలియబెట్టి పదినిమిషాలు తర్వాత దించుకోవాలి.గోంగూర పప్పు రడీ...
|