|
Kabaddi
|
కబడ్డీ (చెడుగుడు)
|
|
ఇంచు మించు భారతదేశంలో ప్రతి గ్రామిణసీమలో కనిపించే క్రీడ కబడ్డీ.దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికార క్రీడగా గుర్తించింది.ఈ ఆట తమిళనాడు రాష్ట్రంలో పుట్టింది.కబడ్డీ క్రీడను మన రాష్ట్రంలోనే కాక పంజాబ్ రాష్ట్రం కూడా అధికార క్రీడగా గుర్తించింది.
కబడ్డీ ఆట ఆడేవిధానం -
రెండు జట్టులు తలపడే ఈ ఆటలో ఒకో జట్టుకు సంభందించిన వివరాలు -
ప్రతీ జట్టులో ఆటగాళ్ళ సంఖ్య -7
రిజర్వు ఆటగాళ్ళు -5
ఆట నిర్ణిత సమయం -40 నిమిషాలు
విరామ సమయం - 5 నిమిషాలు
కోర్టు కొలతలు - 12.5 మీ,10 మీ ఆడే విధానం -
ఇవతలి జట్టులోని ఆటగాడు అవతలి జట్టులోకి కబడ్డీ కబడ్డీ అంటూ గుక్క తిప్పుకోకుండా కూత కూస్తూ జట్టు సభ్యులను అంటుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో అవతలి జట్టులోకి ఆటగాళ్ళు ఈ ఆటగాన్ని మధ్యలో ఉన్న బిద్దె దాటకుండా నిర్ణిత సమయంలో పట్టుకుని నిలువరించగలిగితె ఆ సభ్యుడు అవుట్ అయినట్టు లెక్క ఒకవేళ ఆసభ్యుడు బిద్దె దాటెసి తన జట్టులోకి ప్రవేశించగలిగితే ఎంత మంది అయితే అతన్ని పట్టుకున్నారో వారందరూ అవుట్ అయినట్టు లెక్క.బిద్దె దాటకుండా అ సభ్యుడు గుక్క గనుక ఆపుచేస్తే కూడా అవుట్ అయినట్టె లెక్క చివరకు నిర్ణిత సమయంలో ఎజట్టుకు అయితే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో ఆజట్టు గెలిచినట్టు లెక్క. |
|
|
Page 1
|
మన రాష్ట్ర చిహ్నాలు
|
|
|
|
|
 |