Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Chandragiri fort
చంద్రగిరి కోట
handragiri fort,Chandragiri fort history,Chandragiri fort history in telugu,Chandragiri fort photos,Chandragiri fort images,Chandragiri kota history in telugu
   

    చిత్తూరు జిల్లాలోని మండల కేంద్రమైన చద్రగిరిలో ఈకోట కలదు.దీనిని శ్రీకృష్ణదేవరాయుల కాలంలో 1640లో నిర్మించబడింది.చంద్రగిరి కృష్ణదేవరాయులు మంత్రి అయిన తిమ్మరుసు జన్మస్ధలం.అర్ధచంద్రకారంలో ఉన్న కొండపైన దీనిని నిర్మించారు.కావున దీనికి చంద్రగిరి కోట అని పేరు వచ్చింది.ఈ కొండ పైనుండి శ్త్రువుల రాకను గమనించి అప్రమత్తమయ్యెవారట.ఈ కోటను పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించారు.శత్రువుల నుండి కోటను రక్షించుకొవడానికి చుట్టూ ఒక కందకం నిర్మించి దానిలో మొసళ్ళను పెంచేవారట.అచ్యుతరాయులను ఈ కోటలోనే నిర్బందించారట.
ఈ కోటలో చాలా వరకూ ఇపుడు శిదిల మయ్యింది.మిగిలిన దానిని పరిరక్షించడానికి పురావస్తుశాఖవారు కొంత భాగం భాగుచేసి మ్యూజియం ను ఏర్పాటు చేశారు.కొండ పైన సైనిక అవసరాల కోసం రెండు చెరువులను నిర్మించి నీటిని కింది నుండి పైకి పంపేవారు.ఇప్పటికి కూడా అప్పటి చెరువులను కోండపైన చూడవచ్చు.రాజ్ మహల్ 3 అంతస్తులు,రాణిమహల్ 2 అంతస్తులుగా నిర్మించబడింది.అయితే రాణీ వాసం చాలా వరకూ పాడయిపోయింది.దీని పక్కనే అంతాఃపుర అవసరాలకోసం బావికలదు. దీనికి కూతవేటు దూరంలో శత్రువులను ఊరి తీయడానికి రింగులు కలవు.ఈ కోటలో ఒంకా అమ్మవారి దేవాలయం,పాండవుల,ద్రౌపతిల దేవాలయం మొదలైనవి చూడవచ్చు.

    ఈ కోటను చాలా వరకూ ముస్లిం పాలకులు అనేక దాడుల్లో పాడు చేసారు.పాడవగా మిగిలిన వాటిని రాజమందిరంలో గల మొదటి అంతస్తులో గల మ్యూజీయంలో సందర్శకుల కోసం ఉంచారు.రెండవ అంతస్తులో రాజదర్భారు మూడవ అంతస్తులో కోట నమూనా అప్పటి ప్రజల విధానం మొదలైనవి సందర్శన కోసం ఉంచారు.మిగిలిన ప్రాంతమును అభివృద్దికి అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు 5కోట్లు విడుదల చేసారు.వీటితో కోట చూట్టూ చక్కని ఉద్యానవనం ను నిర్మించారు.అంతేకాక కోట యొక్క చరిత్రను బావితరాలకు తెలియ చెప్పుట కొరకు సౌండ్ అండ్ లైట్ షో తెలుగు,ఇంగ్లీషు భాషల్లో ఏర్పాటు చేశారు.దీనికి టిక్కెట్ ధర 25 రుపాయిలు.
ఎలా వెళ్ళాలి -
    చంద్రగిరి కోటను చేరుకొవడానికి ఆర్టిసీ బస్సు సౌకర్యం కలదు.

Page 1
 మన చారిత్రక కట్టడాలు
   గొల్కోండ కోట చంద్రగిరి కోట
   చార్మినార్
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]