Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Uthappam

ఊతప్పం

కావలసిన పదార్ధాలు -
పంచమిశ్రమం పిండి - రెండు కప్పులు
క్యారెట్ తురుము - అరకప్పు
ఉల్లితురుము - అరకప్పు
టమోటొ ముక్కలు - పావుకప్పు
అల్లం ముక్కలు - ఒక స్పూన్
పాలు - పావు లీటరు
కొబ్బరి తురుము - అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా పంచమిశ్రమం పిండిని ఒక గిన్నెలో తిసుకుని తగినన్ని పాలు పోసి దొసెల పిండిలా కలుపుకోవాలి.ఇందులో ఉల్లి తురుము,టమోటా తురుము,క్యారెట్ తురుము,అల్లం ముక్కలు,కొబ్బరి తురుము,పచ్చిమిర్చి,జీలకర్ర,ఉప్పు వేసి బాగా కలపాలి.పిండి మరీ గట్టిగా అయితె మరిన్ని పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక స్పూన్ వెన్న రాసి బాగా వెడేక్కాక రెండు గరిటెల పంచమిశ్రమం పిండి వెయ్యాలి.మళ్ళి ఒక స్పూన్ నూనె వెయ్యాలి.ఊతప్పం రెండు వైపూల కాలాక తీసేయాలి.దినిని పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
Page 1