Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Aratikaya bajji

అరటికాయ బజ్జీ

కావలసిన పదార్ధాలు -
అరటికాయలు - రెండు
నూనె - పావుకిలో
శనగపిండి - అరకిలో
వాము - రెండు టీస్పూన్స్
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను చెక్కి చక్రాల్లాంటి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.ఆతరువాత ఒక గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.ఇపుడు పొయ్యిమీద మూకెడలో నూనెపోసి కాగిన తర్వాత అరటికాయలు చక్రాలు శనగపిండిలో వేసి పూర్తిగా మునిగేటట్టు మించి నూనెలో వేసి వేయించాలి బజ్జిలు బాగా వేగినతర్వాత చిల్లుల గరెటతో బజ్జీలను గిన్నెలో వేసుకోవాలి.ఇంకేముంది అరటికాయ బజ్జిలు రడీ.బజ్జిలు బాగా లావుగా పొంగాలంటే పిండిలో కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి.
Page 1