తయారుచేయు విధానం -ముందు రోజు రాత్రి మినపప్పును నీళ్ళలో నానబెట్టుకోవాలి.మర్నాడు పొద్దున్నే మెత్తగా రుబ్బుకొవాలి.చేతికి ఉండలు వెచ్చేలా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి.ఇందులో జిలకర్ర,పచ్చిమిరపకాయ ముక్కలు,అల్లం,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు ఉప్పు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి కడాయి పెట్టి నూనె పొసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి అరిటాకుపై గారెల్లా ఒత్తుకుని నూనెలో వేయాలి.బంగారు రంగు వచ్చే వరకూ వేగనిచ్చి తిసేయాలి.
|