తయారుచేయు విధానం -ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరబెట్టుకుని ఉంచుకోవాలి.తరువాత వంకాయలను నిలువుగా ముక్కలుగా కోసుకోవాలి.తర్వాత పచ్చిమిరపకాయలు,అల్లం కలిపి రుబ్బి చిన్న ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నెను ఉంచి నూనె పోసి మరిగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,పచ్చిమిరపకాయ ముక్కలు,అల్లం ముక్కలు,లవంగాలపొడి,దాల్చినచేక్క పొడి వేసి వేయించుకోవాలి.ఇవి వేగిన తర్వాత కోసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.ఆతరువాత కడిగి ఉంచుకున్న బియ్యం వేసి బాగా కలుపుకోవాలి.ఇపుడు ఉప్పు,పసుపు,మసాలా పొడి వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.తర్వాత వంతుకు రెండు వంతులు నీరు పోసి మూత పేట్టి సన్నని సేగపై ఉడకనివ్వాలి.ఉడికిన తర్వాత దింపేముందు కోత్తిమీర జల్లుకుంటే మంచి సువాసన వస్తుంది.
|