తయారుచేయు విధానం -ముందుగా బియ్యాన్ని కడిగి అన్నం కాస్త పలుకులుగా వండుకోవాలి.సోయా చంక్స్ ను వేడి నీటిలో వేసి మూడు నాలుగు నిమిషాలు నాననివ్వాలి.నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు వెడల్పాటి పాత్రలో నూనె వేసి కాగాక తరిగిన బిన్స్,క్యారెట్ ముక్కలు వేయించి మరి మెత్తగా కాకుండా మగ్గనివ్వాలి.పది నిమిషాలయ్యాక తగినంత ఉప్పు సోయా చంక్స్ కలపాలి.ఐదునిమిషాలయ్యాక ముందుగా వండి పెట్టుకున్న అన్నం కలిపి మసాలా చల్లి సన్నని మంటపై ఉంచి బాగా కలపాలి.అన్నం బాగా వేడిగా అయ్యాక జిడిపప్పు,ఉల్లికాడలతో అలంకరించాలి.వేడి వేడి సోయా ఫ్రెడ్ రైస్ రడీ.
|