తయారుచేయు విధానం -బియ్యాన్ని ఒక రోజు ముందే కడిగి పెట్టుకోవాలి.తరువాత రోజు మేత్తగా పిండి కొట్టుకొవాలి.తరువాత పెసరపప్పును వేయించి మెత్తగా పొడి చేసుకొవాలి.పెసరపప్పు పొడిని బియ్యప్పిండిలో కలపాలి.దీనిలో తగినన్ని నీళ్ళు,100 గ్రాముల నూనె తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని గుడ్డపై గుండ్రంగా చక్కిడాల్లా చుట్టుకోవాలి.ఇవి ఆరాక స్టౌ వెలిగించి మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి ఈ చక్కిడాలను వేసి దొర రంగు వచ్చే వరకు వేయించి తిసేయాలి.
|