Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Bobbatlu

బొబ్బట్లు

కావలసిన పదార్ధాలు -
శేనగపప్పు - పావుకిలో
బెల్లం - పావుకిలో
పచ్చికొబ్బరి - అరకప్పు
నెయ్యి - పావుకిలో
మైదాపిండి - 200 గ్రాములు
యాలకులు -10
నూనె - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా మైదాపిండిని కొద్దిగా నీళ్ళతో కలుపుకుని నూనెలో నానబెట్టాలి.ఇప్పుడు శనగపప్పుని కుక్కర్లో ఉడకబెట్టాలి.బాగా మెత్తగా ఉడికాక అందులో బెల్లం,యాలకులపొడి,పచ్చి కొబ్బరి తురుము,వేసి ఉడకనిచ్చి దించేయాలి.చల్లారిన తర్వాత దిన్ని మెత్తగా రుబ్బుకోవాలి.ఇలా రుబ్బిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి.ఇప్పు డు మైదాపిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని ఒక అరిటాకుపై నెయ్యిరాసి దానిపై ఈ ఉండని వెడల్పుగా ఒత్తుకుని మధ్యలో పూర్ణం ఉండ పెట్టి నాలుగువైపూలా మూసేసి చెత్తో చపాతిలా మెల్లగా ఒత్తుకోవాలి.ఇప్పుడు పెనంపై నెయ్యి వేసి దానిపై ఒత్తుకున్న బొబ్బట్టుని వేసి రెండుపైపులా దొరగా వేయించుకోవాలి.అంతే నొరూరించే బొబ్బట్లు రడీ.
Page 1