Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Bhadrachalam sita rama swamy

భద్రాచలం సీతారామస్వామి

      తానిషా ప్రభువు శ్రీరామచంద్రుని యొక్క లీలలు కల్లారా చూసినప్పటి నుండి పరవశించి ప్రతీయేటా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు సమర్పించేవాడట.ఈ ఆనవాయితి ఇప్పటికి కూడా జరుగుతుంది. రాష్ట్రప్రభుత్వం నుండి స్వామి వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారు.
భద్రాచలంలోని స్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 నుండి రాత్రి 9.00గంటల వరకూ తెరచి ఉంచుతారు.సాధారణ దర్శనానికి 2.రూ అంతరాలయ దర్శనానికి 10.రూగా ఉంది.
భద్రాచలంలో చూడవలసిన ఇతర ఆలయాలు -
1.గోవిందరాజులస్వామి ఆలయం
2.నరసిమ్హస్వామి ఆలయం
3.యోగానంద నరసిమ్హస్వామి ఆలయం
4.శ్రీరామదాసు ద్యానమందిరం
5.రంగనాయక స్వామి ఆలయం
6.వేణుగోపాలస్వామి ఆలయం
7.హరనాద ఆలయం

     ఇంకా భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది.రాముడు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నాడట.ఈ ప్రాంతం ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటూ భక్తులను ఆహ్లదపరుస్తుంది.ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన సన్నివేశాలు శిలా రూపంలో మనకు కనిపిస్తాయి.పక్కనే వేణు గోపాలస్వామి ఆలయం కూడా ఉంది.ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐఖ్యమవుతుంది.ఈ వాగు గట్టుమీదే సీతమ్మవారు స్నానంచేసి తన నార చీరలను ఆరేసుకునెదట.అందికే ఈ వాగును సీతమ్మవాగు అంటారు.విశేషమేమిటంటే ఇప్పటికి ఆవిడ ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి అక్కడ.ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించిన రాళ్ళను కుడా అక్కడ చూడవచ్చు.

పర్ణశాల దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు -
యటపాక -
     ఈ ప్రాంతంలోనే రావణాసురుడుతో జటాయివు పోరాడి సీతాదేవి యొక్క సమాచారం శ్రీరాముడికి చేరవేసి మరణిచాడట.ఇక్కడ రామున్ని కులాసరాముడు అంటారు.
రధగుట్ట -
     ఈ గుట్ట మిదే సీతాదేవిని అపహరించడానికి వచ్చిన రావణుడు రధం ను నిలిపాడట.
దుమ్ముగుడెం -
     ఇక్కడ రాముడు రాక్షసులను చంపి దహనకాండ నిర్వహించాడట.వారి చితాభస్మాల ధూలి ఆప్రాంతం అంతా కమ్మి ఉండటంతో దీనికి దుమ్ముగుడెం అని పేరు వచ్చింది అని చెబుతారు.
గోదావరి నది -
     పర్ణశాల ఒడ్డునే గోదావరి నది ప్రవహిస్తుంది.ఇక్కడికి వచ్చిన యాత్రికులు గోదావరి నదిని విక్షించడానికి వీలుగా మర పడవలు ఏర్పాటు ఉంది.
గుండాల -
     ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఉష్టగుండాలు ఉన్నాయి.ఎక్కడ తవ్వినా వేడినీరు ఉబికి వస్తుంది.దీనికి ఒక కధ ప్రచారంలో ఉంది.వనవాస సమయంలో సీతమ్మవారు స్నానానికి శ్రీరాముడు తన బాణం భూమిలోకి వెయ్యగానే వేడి నీరు ఉబికి వచ్చిందట.అవే ఇప్పుడు ఉష్ణగుండాలు.
Page 1 2 3
Bhadrachalam Temple Photo Gallery