Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Vijayawada kanakadurgamma

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి

ప్రాంతం- కృష్టా జిల్లాలోని విజయవాడ
దైవం- కనకదుర్గమ్మ తల్లి
మాట్లాడే భాషలు-  తెలుగు,ఇంగ్లిష్
 

క్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి.ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.ఒకసారి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాము.

స్థల పురాణం -
     పూర్వం కీలుడనె యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకొమ్మని అడగగా అమ్మా నువ్వు ఎపుడూ నా హృదయ స్ధానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు.అదివిన్న అమ్మ చిరునవ్వుతో సరే కీల నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానది తిరంలో పర్వతరూపుడవై ఉండు నేను కృతాయుగంలో అసుర సమ్హరం తరువాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యింది.కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు.తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషున్ని వదించి కీలుడి కిచ్చిన వరం ప్రకారం మహిషవర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది.తదనంతరం ప్రతిరోజు ఇంద్రాదిదేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది.అమ్మవారు కనకవర్ణశోభితరాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది.
    ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరున్ని కూడా కొలువుంచాలనే ఉద్దెశంతో బ్రహ్మదేవుడు శివున్ని గురించి శతాశ్వమేదయాగం చేశాడు.దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిసాడు.అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాధ.

     మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా తనని పరిక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్లయుద్దం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు.స్వామి ఇక్కడ మల్లయుద్దం చేసాడు కావున మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు.

     ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగన మల్లికార్జునున్ని పునఃప్రతిష్టించారు.మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్ట చేసి శాంతింపచేసారు.అప్పటి నుండి అమ్మ పరమశాంత స్వరూపినిగా భక్తులను కనువిందు చేస్తుంది.ఇక్కడ మరో విశేషమేమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై వున్నారు.కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతి పాత్రమైనవి శరన్నవరాత్రులు.ఈ రోజుల్లో గనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.ఈ దసరా తోమ్మిది రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు.


Page 1 2
Kanakadurgamma Temple Photo Gallery

మన ఆలయాలు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి
కాణిపాకం వరసిద్దివినాయక స్వామి భద్రాచలం సీతారామస్వామి
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి