|
Bhadrachalam sita rama swamy
|
భద్రాచలం సీతారామస్వామి
|
భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు,పండుగలు-
శ్రీరామనవమి -
స్వామివారి ఆలయంలో ఎంతో కన్నులపండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం.చైత్రశుద్ద నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు.కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు.ఇప్పటికి ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు.కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది.సీతారాముల కళ్యాణమహౌత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధరాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.
వైకుంఠ ఏకాదశి-
శ్రీమహవిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు.ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం,ఉదయం 5గంటలకు జరిగే వైకుంఠద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి.
వాగ్యేయకార మహౌత్సవం -
భక్తరామదాసు పేర 1972నుండి వాగ్యేయకార మహౌత్సవాలు నిర్వహించబడౌతున్నాయి.
ఎంతదూరం - ఎలావెళ్ళాలి ?
రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి రవాణాసౌకర్యం కలదు.వివిధ ప్రాంతాల నుండి దూరం కిలోమీటర్లలో.
రాజమండ్రి నుండి - 160
విజయవాడ నుండి - 201
హైదరాబాద్ నుండి -312
వైజాగ్ నుండి - 390
చెన్నై నుండి - 647
వివిధ మార్గాల ద్వారా భద్రాచలం చేరుకోవడానికి మార్గాలు -
రోడ్డుమార్గం ద్వారా -
రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి భద్రాచలం చేరుకోవడానికి రోడ్డు మార్గం కలదు.ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్,టి.సి బస్సు సౌకర్యం కలదు.
జలమార్గం ద్వారా -
భద్రాచలానికి జలమార్గం ద్వార కూడా చేరుకోవచ్చు.రాజమండ్రి నుండి గోదావరి నది ద్వారా లాంచి సౌకర్యం కలదు.
ప్లైట్ మార్గం ద్వారా -
ప్లైట్ ద్వారా భద్రాచలం చేరుకోవాలంటే దగ్గరలోని ఎయిర్ పోర్ట్స్ రాజమండ్రి,హైదరాబాద్,చెన్నైలు కలవు.
రైలు మార్గం ద్వారా -
భద్రాచలానికి రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్ కొత్తగుడెం కలదు.
ఎక్కడ ఉండాలి -
భద్రాచలంలో అన్నిరకాల ప్రజలను వారివారి స్తోమతమేరకు వసతి సౌకర్యం కలదు.ప్రభుత్వం సత్రాలు,కాటేజ్లు,గెస్ట్ హౌస్ లు,హౌటల్స్ కలవు.
వివిధ సత్రాలు,సదనాల వివరాలు - నార్మల్
యాత్రిక సదనం 20రూ
వేములవాడ సదనం 45రూ
యాదగిరి సదనం 75రూ
నాగిరెడ్డి సదనం 60రూ
చంద్రమౌళి సదనం 150రూ
హైక్లాస్
బ్రహ్మాజి కాటెజ్(ఏ.సి) 300రూ
అల్లూరి నిలయం(ఏ.సి) 300రూ
సీతా నిలయం (ఏ.సి) 400రూ
నంది నిలయం(ఏ.సి) 500రూ
గోల్డ్ స్టార్ (ఏ.సి) 500రూ |
|
|
|
|
|
Bhadrachalam Temple Photo Gallery
|
|
|
|
|