Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Bhadrachalam sita rama swamy

భద్రాచలం సీతారామస్వామి

ప్రాంతం- ఖమ్మం జిల్లాలోని భద్రాచలం
దైవం- శ్రీ సీతారామస్వామి
ఆలయం నిర్మించిన సం-  
మాట్లాడే భాషలు-  తెలుగు,ఇంగ్లిష్
 
రమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమెతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం.ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు.రామ నామం జపించిన చాలు ముక్తిమార్గం కలుగుతుంది.అంతటి పరమ పావన క్షేత్రం గురించి ఒక సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

     ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుదై చతుర్భుజుడుగా వెలిసారు.ఇంకొ ప్రత్యేకత ఎమిటంటె స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటం.ఈ క్షేత్రం ఎంతో ప్రాచినమైనది.దీని గురించి బ్రహ్మండపురాణంలోనూ,గౌతమీ మహత్స్యంలోనూ ప్రస్తావన ఉంది.ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుదై వనవాసం చేసాడని ప్రతిది.ఒకసారి స్ధల పురాణం పరిశిలిస్తే.

స్ధల పురాణం -
     శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట.సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట.దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు.దీనితో బద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట.కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎపుడూ రామనామ స్మరణ చేస్తుందేది.ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఎదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట.దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోవెళ్ళి చూడగా పుట్టలో వెంచెసి ఉన్నాడట.పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకుచేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహలను ఉంచి పూజలు చేస్తుండెదట.

     భద్రారెడ్డి పాలెంకు కూతవేటుదూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న,చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు.యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బందువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీర్దారుగా నియమించాడు.ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతం ను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి,పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయం ను సర్వాంగసుందరంగా నిర్మించాడట.దీనితో కొపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చరసాలలో భందించి చిత్రహింసలకు గురి చేస్తాడు.తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట.దినితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎపుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు.అదీ ఆలయానికి ఉన్న చరిత్ర.
Page 1 2 3
Bhadrachalam Temple Photo Gallery

మన ఆలయాలు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి
కాణిపాకం వరసిద్దివినాయక స్వామి భద్రాచలం సీతారామస్వామి
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి