చరిత్ర
పురాతత్వ ఆధారాలను బట్టి వేములవాడ పశ్చిమ చాళుక్యుల రాజధాని అని తెలుస్తున్నది. క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ చాళుక్యరాజు మొదటి నరసింహుడికి గల “రాజాదిత్య” అనే బిరుదు నుంచి రాజరాజేశ్వరాలయం అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు.
చారిత్రాత్మకంగా వేములవాడ క్షేత్రం అతిసనాతనమైనదని, చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందినట్లు పరిశోధకుల అంచనా. క్రీ.శ. 750 నుంచి 973 వరకు సుమారు 220 సంవత్సరాలు వేములవాడ చుట్టుపక్కల ఆలయాల నిర్మాణం సాగినట్లు తెలుస్తున్నది.
వేములవాడలోని మరికొన్ని ఆలయాలు -
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కాక వేములవాడలో సీతారామచంద్రస్వామి, అనంతపద్మనాభస్వామి, త్రిపురసుందరి, కేదారేశ్వర, భీమేశ్వరస్వామి, వడ్డెగేశ్వరస్వామి ఆలయాలున్నాయి. గండదీపం, ఉత్సవ మూర్తుల అద్దాల మహలు, నాగిరెడ్డి మండపం ప్రధానాలయానికి అనుబంధంగా వున్నాయి.
ఎట్లా వెళ్లాలి
వేములవాడ కరీంనగర్‌కు 36 కిమీల దూరంలో కరీంనగర్ - కామారెడ్డి దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచీ, కరీంనగర్ నుంచీ ఎక్స్ ప్రెస్ బస్సులు చాలా నడుస్తుంటాయి.
వసతి సౌకర్యం
దేవస్థానం కల్పిస్తున్న వసతి సౌకర్యం ఉన్నది.
వెల్లంపల్లి అవినాష్