సాగర తీరాన ప్రకృతి ఒడిలొ ఒదిగిన అందాల నగరం విశాఖపట్నం.విశాఖ నగరానికి వైజాగ్,వాల్తేరు అనే పేర్లు కలవు.విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లొ హైదరాబాద్ తరువాత రెండవ అతి పెద్ద నగరం.చుట్టూ పచ్చని కొండలు,సాగర తీరం ఈ రెండూ ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తాయి.ఇక్కడ సహజ సిధ్దంగా ఏర్పడిన ఫొర్ట్ దేశంలోని పెద్ద షిప్ యార్డ్ లలొ ఒకటి.అతి పెద్దదైన స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడే కలదు.
వైజాగ్ లొ చూడవలసిన ప్రదేశాలు -
కైలాసగిరి -
కైలాసగిరి ప్రాంతం వైజాగ్ లొ సుందరమైన పిక్నిక్ స్పాట్.సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఈ ప్రాంతం కలదు.ఇక్కడ నుండి సముద్ర తీరం మంచి వ్యూ లో కనబడుతుంది.శివుడు,పార్వతిల విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఇవే కాకుండా పిల్లలకు పార్క్ రోప్ వే మొదలయిన ఎన్నొ ఉన్నాయి.
రామకృష్ణా బీచ్ -
కైలాసగిరి తర్వాత మరో చూడదగిన ప్రాంతం రామకృష్ణా బీచ్(ఆర్.కె బీచ్).సాయంకాలం వేళ ఇక్కడ తిరగడం ఒక ప్రత్యేకమైన అనుభూతి.నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ అనేక సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి.బీచ్ వాలీబాల్,స్విమ్మింగ్ మొదలైన ఈవెంట్స్ ని ఇక్కడ నిర్వహిస్తారు.
రిషి కొండ బీచ్ -
రిషికొండ బీచ్ కూడా మంచి టూరిష్ట్ స్పాట్.ఇది వైజాగ్ నగరానికి 8 కిమీ దూరంలో ఉంది.ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పున్నమి రిసార్ట్ ని ఏర్పాటు చేసారు.
ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ -
ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ తూర్పు కొండల నడుమ వైజాగ్ నగరం నందు ఏర్పాటు చేసారు.ఇక్కడ మనం రక రకాలైన జంతువులను,పక్షులను చూడవచ్చు.ఈ పార్క్ ప్రపంచంలోని పెద్ద పార్క్ లలొ ఒకటి.
సిమ్హాచలం వరాహ లక్ష్మీనరసిమ్హ స్వామి వారి ఆలయం -
ఈ ఆలయం వైజాగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో కలదు.లక్ష్మీ నరసిమ్హస్వామినే సిమ్హాద్రి అప్పన్నగా స్థానికులు పిలుస్తారు.ఈ అలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉంది.ఈ అలయం చాలా ప్రాచీనమైనది.స్వామి వారిని హిరణ్యకసిపుడు సమ్హారానంతరం ప్రహల్లాదుడూ ఇక్కడ ప్రతీష్టించాడని ప్రతీది.
ఇక్కడ చైత్రమాసంలో రధొత్సవాలును నిర్వహిస్తారు.ఇక్కడికి చేరుకొవడానికి వైజాగ్ నుండి అర్.టి.సి వారు బస్సు సర్వీసులన్ను నడుపుచున్నారు.బస చెయ్యడానికి కాటేజ్ లు కూడా కలవు.
|