చిత్తూరు జిల్లాలోని మండల కేంద్రమైన చద్రగిరిలో ఈకోట కలదు.దీనిని శ్రీకృష్ణదేవరాయుల కాలంలో 1640లో నిర్మించబడింది.చంద్రగిరి కృష్ణదేవరాయులు మంత్రి అయిన తిమ్మరుసు జన్మస్ధలం.అర్ధచంద్రకారంలో ఉన్న కొండపైన దీనిని నిర్మించారు.కావున దీనికి చంద్రగిరి కోట అని పేరు వచ్చింది.ఈ కొండ పైనుండి శ్త్రువుల రాకను గమనించి అప్రమత్తమయ్యెవారట.ఈ కోటను పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించారు.శత్రువుల నుండి కోటను రక్షించుకొవడానికి చుట్టూ ఒక కందకం నిర్మించి దానిలో మొసళ్ళను పెంచేవారట.అచ్యుతరాయులను ఈ కోటలోనే నిర్బందించారట.
ఈ కోటలో చాలా వరకూ ఇపుడు శిదిల మయ్యింది.మిగిలిన దానిని పరిరక్షించడానికి పురావస్తుశాఖవారు కొంత భాగం భాగుచేసి మ్యూజియం ను ఏర్పాటు చేశారు.కొండ పైన సైనిక అవసరాల కోసం రెండు చెరువులను నిర్మించి నీటిని కింది నుండి పైకి పంపేవారు.ఇప్పటికి కూడా అప్పటి చెరువులను కోండపైన చూడవచ్చు.రాజ్ మహల్ 3 అంతస్తులు,రాణిమహల్ 2 అంతస్తులుగా నిర్మించబడింది.అయితే రాణీ వాసం చాలా వరకూ పాడయిపోయింది.దీని పక్కనే అంతాఃపుర అవసరాలకోసం బావికలదు. దీనికి కూతవేటు దూరంలో శత్రువులను ఊరి తీయడానికి రింగులు కలవు.ఈ కోటలో ఒంకా అమ్మవారి దేవాలయం,పాండవుల,ద్రౌపతిల దేవాలయం మొదలైనవి చూడవచ్చు.
|