నాగార్జునా సాగర్ కృష్ణా,నల్గొండ జిల్లాల సరిహద్దులొ కలదు.ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు మంచి టూరిష్ట్ స్పాట్.ఇక్కడ కృష్టా నదిపై నిర్మించిన ఆనకట్టను ప్రధానంగా చూడవచ్చు.వర్షాలు బాగా పడి ప్రాజెక్ట్ లో సంవృద్ధిగా నీరు చేరినపుడు ఇక్కడికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల నల్గొండ,గుంటూరు జిల్లాలొని వేల ఎకరాలకు నీరు అందుతుంది.అంతే కాక ఈ ప్రాజెక్ట్ కేవలం నీటి సరఫరానే కాక్ విద్యుత్ సరఫరా కూడా చేస్తుంది.దీని ప్రధాన డ్యాం మొత్తం రాతితొ నిర్మించబడింది.దీనికి రెండు వైపులా నిర్మించిన కట్టలు దేశంలొనే అతి పొడవైనవి.ఈ ప్రాజెక్ట్ నుండి రెండు ప్రధాన కాలువలు ద్వారా నీటి సరఫరా జరుగుతుంది.కుడి కాలువను జవహర్ కాలువ అని,యడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు.
ఈ ప్రాజెక్ట్ ఉన్న ప్రాతం నల్గొండ జిల్లా నందికొండ గ్రామంలో ఉంది.తొలుత ఈ ప్రాజెక్ట్ ని నందికొండ ప్రాజెక్ట్ అని పిలిచేవారు.ఆ తరువాత నాగార్జునా సాగర్ గా పేరు మార్చబడింది.ఆచార్య నాగార్జునుడు ఈ కొండ పైనే తన శిష్యులకి భొదనలు చేసాడు.
ఈ ప్రాంతానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది.శాతవాహనుల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతం ప్రసిద్ద బౌద్ద క్షేత్రంగా విరాజిల్లినది.నాగార్జున కొండ అసలు పేరు శ్రీ పర్వతం.నాగార్జునుడు ఈ కొండపై తన శిష్యులకు భొదనలు చేసాడు కావున ఈ కొండకి నాగార్జున కొండ అనే పేరు వచ్చింది.నాగర్జునుడు ఇక్కడ ఉన్నాడనడానికి ఆధారంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఎన్నొ అమూల్యమయున అవశేషాలు బయటపడ్డాయి.వీటిని ఆ ప్రాంతంలో మ్యూజియం నిర్మించి సందర్శకుల సందర్శనార్ధం ఉంచారు.
నాగార్జునా సాగర్ లొ చూడవలసిన ప్రదేశాలు
1.నాగార్జున కొండ మ్యూజియం -
నాగార్జునా సాగర్ నిర్మాణ సమయంలో తవ్వకాలలో బయట పడిన 2 వ శతాబ్ధం నాటి అమూల్యమైన అవశేషాలతో ఆచార్య నాగర్జునుడి పేరిట నాగార్జున కొండ మ్యూజియం ని ఈర్పాటు చేసారు.ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచం లోని పురావస్తు మ్యూజియం లలొకెల్లా పెద్దది.దీనిలొ బుద్దునిదిగా చెప్పబడుతున్న దంత అవశేషము, కర్ణాభరణము చూడదగినవి.ఇవే కాక అనేక పురావస్తు శాసనాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు
2.సాగర మాత ఆలయం -
నాగర్జునాసాగర్ కి దక్షిణాన విజయపురి సౌత్ లొ నిర్మించిన సాగరమాత (మేరీమాత) ఆలయం చూడదగినది.ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్మించబడిన చర్చ్.ఇక్కడ మేరీ మాతకి కొబ్బరికాయలు కొట్తడం,అగరవత్తులు వెలిగించడం వంటివి కూడా చేస్తారు.
|