గోల్కొండ కోట కోట రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ ప్రాంతాన్ని క్రీశ 1083 నుండి 1323 వరకూ కాకతీయులు పరిపాలించారు. గోల్కోండ అసలు పేరు గొల్ల కొండ.దీనికి ఈ పేరు రావడానికి చిన్న కధ ఉంది.ఇక్కడ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరికి మంగళవారం అనే కొండపై దేవతావిగ్రహం కనపడిందంట.ఈ విషయాన్ని కాకతీయరాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట.కాలక్రమంలో గొల్లకొండ గొల్కోండగా రూపాంతరం చెందింది.చాలా కాలంవరకూ ఇది కాకతీయుల అధీనంలో ఉండేది.అయితే యుధ్దసమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కోడ కోట అజీం హుమాయూన్ వశమయ్యింది.దీనితో ఈకోట మహ్మదీయిల చేతిలోనికి వెళ్ళింది.తరువాత కాలంలో అనేక రాజుల చేతులు మారి 15న శతాబ్ద సమయంలో కుతుబ్ షాహీ రాజుల చేతులోకి వెళ్ళగా వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కొటను కట్టించారు.తరువాత కుతుబ్ షాహీ వంశస్తులను ఔరంగజేబు జయించి ఈకోటను కొంతభాగం వరకూ నాశనం చేశాడు.దీనితో ఇక్కడ పాలన కాలగర్బంలో కలిసిపోయింది.
ఈకోట ప్రస్తుతం ఎంతో చరిత్రను తనలో ఇడుమడింపచేసుకుని భావితరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.ఈకోటను 120మీటర్లు ఎత్తుకలిగిన నల్లరాతికొండపై నిర్మించారు.గోల్కోండను శత్రువుల నుండి రక్షించుటకు దీనిచుట్టూ పెద్ద బురుజును నిర్మించారు.ఇది 87 అర్దచంద్రకార బురుజులతో 10 కిలోమీటర్లు కోట చుట్టూ కట్టబడింది.ఈకోటలో నాలుగు ప్రధాన సిమ్హద్వారాలు,అనేక రాజమందిరాలు,దేవాలయాలు,మసీదులు కలవు.కోటలోనికి శత్రువులు ప్రవేశిచినపుడు పైవారికి సమాచారము చేరవేయుటకు ధ్వని శాస్త్రము అధారంగా అద్భుతంగా నిర్మించారు.ఇక్కడ నుండి చప్పట్లు కోడితే కిలోమీటరు దూరంలోని కోట లోపల ఉండే బాలా మిస్సారు వద్ద ఈ శబ్దం చాలా చక్కగా వినపడుతుంది.ఇక్కడనుండి కోటలోనికి చేరుకోవడానికి 380 రాతి మెట్లు కలవు.కోట లోనికి నీటిని అప్పటిలోనే ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసేవారట.ఈకొటలోనుండి నగరంలో ఉన్న చార్మినార్ కు గుర్రం పోయేటంత సొరంగమార్గం ఉందని ప్రచారంలో ఉంది.
|