ఈ కోటలో కాకతీయులచే నిర్మించబడిన ప్రాచీన దేవాలయాలు కలవు.వీటిని పాతకాలం నాటి గండశీలతో నిర్మించారు.అంతే కాకుండా ఈ కోటలోనే శ్రీరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానిషా కారాగారంలో భందించాడు.ఈ కారాగారంలో రామదాసుచే గోడలపైన చెక్కబడిన సీతారామ,లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు.ఈ కోటలో హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా కలవు.
ఈ కోటను భావితరాల కోసం పరిరక్షించుటకు దీనిని పురావస్తుశాఖవారు తమ ఆధీనంలో పరిరక్షిస్తున్నారు.కోటను చూడటానికి ప్రతిరోజు ఎంతోమంది సందర్శకులు దేశ విదేశాలనుండి వస్తారు.వారి కోసం అలనాటి కోట విశేషాలు తెలియచెప్పే సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుచేయబడుతుంది.దీనిని తెలుగు,హిందీ,ఇంగ్లీషు భాషల్లో ప్రదర్శిస్తున్నారు.
షో ప్రదర్శించు సమయాలు -
ఇది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ సాయంత్రం 6.30కు మొదలవుతుంది.మార్చినుండి అక్టోబర్ వరకూ 7గంటలకు స్టార్ట్ అవుతుంది.ఈ షో మొత్తం 55 నిమిషాలు పాటు ఉంటుంది.
ఇంగ్లిషులో - బుధవారం మరియు ఆదివారం
హిందీలో - గురువారం,శుక్రవారం మరియు శనివారం
తెలుగులో -మంగళవారం
సోమవారం ప్రదర్శనకు సెలవు
ఎలా చేరుకొవాలి -
గోల్కోండ కోట హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.సిటీ నుండి చాలా బస్సులు కలవు.ఇవే కాక లోకల్ ట్రాన్స్ పోర్ట్ లయిన ఆటోలు,ట్యక్సీ సౌకర్యం కూడా కలదు.
|