స్థల పురాణం-
ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివిని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరము కావాలనో కోరుకోమని అడిగెను.అపుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.అంత బోలా శంకరుడయిన పరమశివుడు శిలాదుడుకి వరం ప్రాసదించి అంతర్ధానమయ్యెను.తదనంతర కాలంలో శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యు ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడిగెను.అంత పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా.. నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా వరం ప్రసాదించు అని అడిగెను.అడిగిందే తడవుగా వరాలు ప్రసాదించే బొలా శంకరుడు వరం ప్రసాదించి అక్కడే ఉండి పోయను.దానితో కైలాసం ఉన్న పార్వతి,ప్రమద గణాలు కూడా స్వామి వారి బాటనే పట్టి ఇక్కడే కొలువుదీరారు.ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.
ఇంకా స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది.పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు.ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది.ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ.. నేను మీ శిరముపై ఉంచిన మల్లిపూల దండ ఎన్నటికీ వాడి పోకుండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు.శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.