Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Telugu samasalu

సమాసములు

    వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు.సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
ఉదా - అన్న,తమ్ముడు = అన్నదమ్ములు

1.తత్పురుష సమాసము -
ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము.
ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము.
ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు
తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు.
చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి.
పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము.
షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు.
సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి
నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది.

2.కర్మధారయ సమాసము -
విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము
ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది.

3.ద్విగు సమాసము -
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.
ఉదా - ముల్లోకములు = మూడగులోకములు

4.బహువ్రీహి సమాసము -
అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును.

5.ద్వంద్వ సమాసము -
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము
ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును

6.అవ్యయూభావ సమాసము -
సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును.
ఉదా - యధాశక్తి = శక్తికి తగినట్లు
ఉదా - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది.

Page 1

తెలుగు వ్యాకరణం

తెలుసుకోవలసిన విషయాలు