మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.
|
క్రమ సంఖ్య
|
ప్రశ్న
|
సమాధానం
|
1
|
సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
|
బ్రహ్మం
|
2
|
సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
|
దేవతలు
|
3
|
సూర్యుని అస్తమింపచేయునది ఏది?
|
ధర్మం
|
4
|
సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
|
సత్యం
|
5
|
మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
|
వేదం
|
6
|
దేనివలన మహత్తును పొందును?
|
తపస్సు
|
7
|
మానవునికి సహయపడునది ఏది?
|
ధైర్యం
|
8
|
మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
|
పెద్దలను సేవించుటవలన
|
9
|
మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
|
అధ్యయనము వలన
|
10
|
మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
|
తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.
|
11
|
మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
|
మౄత్యు భయమువలన
|
12
|
జీవన్మౄతుడెవరు?
|
దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు
|
13
|
భూమికంటె భారమైనది ఏది?
|
జనని
|
14
|
ఆకాశంకంటే పొడవైనది ఏది?
|
తండ్రి
|
15
|
గాలికంటె వేగమైనది ఏది?
|
మనస్సు
|
16
|
మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
|
ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది
|
17
|
తౄణం కంటె దట్టమైనది ఏది?
|
చింత
|
18
|
నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
|
చేప
|
19
|
రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
|
అస్త్రవిద్యచే
|
20
|
రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
|
యజ్ణ్జం చేయుటవలన
|
21
|
జన్మించియు ప్రాణంలేనిది
|
గుడ్డు
|
22
|
రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
|
రాయి
|
23
|
మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
|
శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన
|
24
|
ఎల్లప్పుడూ వేగం గలదేది?
|
నది
|
25
|
రైతుకు ఏది ముఖ్యం?
|
వాన
|
26
|
బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
|
సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
|
27
|
ధర్మానికి ఆధారమేది?
|
దయ దాక్షిణ్యం
|
28
|
కీర్తికి ఆశ్రయమేది?
|
దానం
|
29
|
దేవలోకానికి దారి ఏది?
|
సత్యం
|
30
|
సుఖానికి ఆధారం ఏది?
|
శీలం
|
31
|
మనిషికి దైవిక బంధువులెవరు?
|
భార్య/భర్త
|
32
|
మనిషికి ఆత్మ ఎవరు?
|
కూమారుడు
|
33
|
మానవునకు జీవనాధారమేది?
|
మేఘం
|
34
|
మనిషికి దేనివల్ల సంతసించును?
|
దానం
|
35
|
లాభాల్లో గొప్పది ఏది?
|
ఆరోగ్యం
|