లింగములు 3 రకాలు అవి
1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.
|