Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Sarojini naidu

సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు,Sarojini naidu,sarojini naidu poems,sarojini naidu biography in telugu,sarojini naidu hall tilak road,Sarojini naidu photos,sarojini naidu freedom fighter,telugu,andhrapradesh,maguva

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. భారత జాతీయ కాంగ్రేసు తొలి మహిళా అధ్యక్షురాలు గా ఎన్నికయిన సరోజినీ దేవి,స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా..
      సరోజినీ దేవి చటోపాధ్యాయ హైదరాబాదులో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబములో ఫిబ్రవరి 13, 1879 న జన్మించారు. ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ స్థాపకుడు, శాస్త్రవేత్త మరియు తత్వవేత్త. తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి. సరోజినీ ఉర్దూ, తెలుగు, ఆంగ్లము, పర్షియన్ మరియు బెంగాలీ భాషలు మాట్లాడేది. ఈమెకు పీ.బీ.షెల్లీ కవిత్వము అంటే చాలా ఇష్టము.1930లో ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీతో పాటు పాల్గొన్న సరోజినీదేవి నిజాము పాలనలో అప్పటి హైదరాబాదులో స్త్రీల చదువుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వలన ఆమె మద్రాసులో చదువుకున్నది. 15 సంవత్సరాల వయసులో ఈమె దక్షిణాదికి చెందిన డా. ముత్యాల గోవిందరాజులు నాయుడు ను కలిసి ప్రేమించింది. చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో ఆయనను కులాంతర వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టము (1872) ప్రకారము 1898 డిసెంబర్ 2న మద్రాసులో పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించారు.
ఈమె ఆంగ్లంలో ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్ వంటి కవితలను రాసారు.


Page 1
 

స్త్రీ - స్పూర్తి