Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Kitchen tips in telugu

వంటింటి చిట్కాలు

»
కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.
»
పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి.
»
నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.
»
పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు.
»
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.
»
అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడగడంవల్ల బాగాశుభ్రపడతాయి.
»
వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి.
»
పసుపు నీటితో కిచెన్ను శుభ్రంచేయడం వల్ల ఈగలు రావు.
»
బిస్కెట్ పేకెట్ బియ్యండబ్బాలో ఉంచడం వల్ల తొందరగా మెత్తబడవు
»
ఇంగువ నీల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.
»
నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.
»
క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.
»
కత్తిపీటకు ఉప్పురాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
»
బట్టలపై నిమ్మరసంగానీ,టూత్ పేస్ట్ గానీ వేసిరుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి.
»
ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.
»
కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.
»
వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.
»
మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుపవస్తువు ఏదైనా వెయ్యాలి.
»
బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.
»
నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వెయ్యాలి.
»
చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.
»
వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి.
»
గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.
»
పకోడిలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాయి.
Page 1

సౌందర్య చిట్కాలు