»
|
ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి.కాబట్టి బయటకు వేళ్ళేటపుడు చేతికి గ్లౌజులు ధరించాలి. |
»
|
చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి. |
»
|
నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్ధనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి. |
»
|
ఆకుకూరలు,పండ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల మీ చేతులు నిగనిగలాడతాయి. |
|
»
|
గ్లిజరిన్,ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి. |
»
|
టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి. |
»
|
బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలసబ్బులో ఉండే రసాయన పదార్ధాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి వుతికిన వేంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కోవాలి. |
»
|
అతివేడయిన,అతిచల్లనైన పదార్ధాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు. |
»
|
ఒకస్పూన్ రోజ్ వాటర్ లో ఒకస్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకు రాసుకుని గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృదువుగా తయారవుతాయి. |