Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Kobbari mamidikaya pachadi

కొబ్బరి మామిడి కాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు -
పచ్చికొబ్బరి చిప్పలు - 2
మామిడి కాయలు - 1
పచ్చిమిరపకాయలు - 5
ధనియాలు - తగినన్ని
జీలకర్ర -
ఆవాలు -
వెల్లుల్లి - 5 రెకలు
మినపప్పు -
ఎండుమిరపకాయలు -
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉప్పు - తగినంత
నూనె - తాలింపుకు సరిపడా
తయారుచేయు విధానం -ముందుగా మూకెడలో నూనె పోసి కాగిన తర్వాత ధనియాలు,ఎండుమిరపకాయలు,జీలకర్ర,వెల్లుల్లిరేకలు,కరివేపాకు వేసి వేయించుకోవాలి.తరువాత మిక్సిలోగాని,రుబ్బురోటిలో గాని పచ్చికొబ్బరి తురుము,మామిడి తురుము,ఉప్పు,కొంచెం నీరు కలిపి దానిలో వేయించుకున్న మిశ్రమాన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి.
Page 1