|
Nevevaru
|
నీవెవరు ?
|
శ్వాసనడిగా నువ్వేమిటని ?
గమ్యమెరుగని గాలిని చేరదీసే చెలికాడిని నెనంది.
చూపునడిగా నివెవ్వరని ?
నీవు చూసే ప్రతిరూపు నెనంది.
మాటనదిగా నీ పని ఏమిటని ?
ఎల్లలెరుగని స్నేహభందానికి యజమానిని నేనంది.
చేతినడిగా నీ గొప్పేమిటని ?
ఊతమడిగిన సహ హ్రుదయానికి చేసే ఉపకారం నా గొప్పంది.
అడుగునడిగా అసలు నీ పొగరేమిటని ?
ఖ్యాతికెక్కిన జాతి ధనులనుసరించే భాగ్యం నాదిమాత్రమేనంది.
ఊహనడిగా నీ కెంతుకింత ఉలుకని ?
జగతి హ్రుదయులనేలు భారత జాతి ప్రాభవాన్ని ఊహిస్తున్నందుకంది.
మనసునడిగా అంబరమంటే సంబరమెందుకని ?
భరత మాత బిడ్డననే తలపులు నన్ను తాకుతున్నదువల్లెనంది. |
|
|
|
|